కంటోన్మెంట్‌ పాలకమండలి ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

Posted On:11-01-2015
No.Of Views:332

సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ పాలక మండలికి ఆదివారం ఉదయం ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. మొత్తం    ఎనిమిది వార్డుల్లో 114 మంది అభ్యర్ధులు పోటీపడుతున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు పోలింగ్‌ జరగనుంది. 187 పోలింగ్‌ కేంద్రాల్లో 647 ఈవీఎం మిషన్లు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతంలో 144 సెక్షన్‌ విధించారు. కౌంటింగ్‌ ఈ నెల 13న జరగనుంది.