కరాచీలో ఘోర రోడ్డు ప్రమాదం : 57 మంది మృతి

Posted On:11-01-2015
No.Of Views:275

పాకిస్తాన్‌, కరాచీలో ఓ బస్సును ఆయిల్‌ ట్యాంకర్‌ ఢీ కొనడంతో 57 మంది దుర్మరణం చెందారు. కరాచీకి 50 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది ఈ ప్రమాదంలో చనిపోయారు. మృత దేహాలను కరాచీలోని జిన్నా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. గాయపడినవారిని కరాచీలోని వివిధ ఆస్పత్రులకు తరలించారు. పాకిస్తాన్‌లో రోడ్ల పరిస్థితి అధ్వాహ్నంగా ఉన్నందునే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని విపక్షాలు ఆరోపించాయి.