రూ. లక్ష కోట్ల పెట్టుబడి పెడతాం:రిలయన్స్

Posted On:11-01-2015
No.Of Views:318

గాంధీనగర్ : గుజరాత్ రాష్ట్రంలో రూ. లక్ష కోట్ల పెట్టుబడులు పెడతామని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తెలిపారు. ఆదివారం గుజరాత్ రాజధాని గాంధీనగర్లో ప్రారంభమైన వైబ్రెంట్ గుజరాత్ శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ముకేశ్ అంబానీ మాట్లాడుతూ...  ప్రపంచంలో అత్యం వేగంగా అభివృద్ధి చెందుతోన్న దేశం బారత్ అని తెలిపారు. గుజరాత్ ప్రభుత్వం ఏటా నిర్వహిస్తున్న ఈ సదస్సు విజయవంతం కావడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు.ఈ సదస్సులో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. మేక్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా... భారత్ కు మరింత బలం చేకూరుస్తున్నాయని మఖేశ్ అంబానీ తెలిపారు. ఈ సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ, ఐరాస అధ్యక్షుడు బాన్ కీ మూన్ తోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. 2003లో వైబ్రెంట్ గుజరాత్ శిఖరాగ్ర సదస్సును అప్పటి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. నాటి నుంచి ఆ సదస్సు ప్రతి ఏటా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.