టాప్‌ హీరోలకు ‘అల్లుడు శీను’ షాక్‌!

Posted On:11-01-2015
No.Of Views:434

నమ్మమంటారా! ఈ విషయం తెలిసిన తర్వాత మీరు కచ్ఛితంగా నమ్మాల్సిందే! అల్లుడు శీను అదేనండి బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌కు అంత సీనుందా అని మీరు గునుక్కోవచ్చు. అందులో మీ తప్పేమీ లేదు. కానీ టాప్‌ హీరోలు ‘ అల్లుడు శ్రీను’ ముందు వెలవెలా బోయారు. అది ఎలాగంటారా! దీన్ని చిత్తగించండి...
2014 డిసెంబర్‌ 28న జెమిని టివి ‘అల్లుడు శ్రీను’ సినిమాను ప్రసారం చేసింది. అయితే అనూహ్యంగా టీఆర్పీ రేటింగ్‌ 16.9గా నమోదవ్వడం అందర్నీ ఆశ్చర్యపర్చింది.  టాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్స్‌ లెజెండ్‌,ఎవడు,రేసుగుర్రం,మనం సినిమాలన్నీ ప్రసారం చేసినా, ఇంత రేటింగ్‌ రాలేదు(ట). ప్రస్తుతానికి టాలీవుడ్‌ పరిశ్రమ జీవులంతా ‘అల్లుడు శీను’  గురించే మాట్లాడుకుంటున్నారట. విపరీతంగా ప్రేక్షకుల్ని ఈ సినిమాలో ఆకర్షించిన అంశాలేమిటంటే మొదట వివి వినాయక్‌ దర్శకత్వం, రెండోది సాయిశ్రీనివాస్‌,సమంత జోడి..ఆకట్టుకున్న నటన. ఇక మూడోది తమన్నా ప్రత్యేక గీతమని టాలీవుడ్‌ పరిశ్రమ విశ్లేషకుల అంచనా. ఏదైతేనేం ‘అల్లుడుశ్రీను’కు పరిశ్రమలో యమ క్రేజ్‌ వచ్చింది. అందుకే రెండో సినిమాకు రడీ అయిపోతున్నాడట. బెస్ట్‌ ఆఫ్‌ లక్‌ అల్లుడు శీను.