నయనతార సన్యాసం స్వీకరించబోతుంది!

Posted On:12-01-2015
No.Of Views:311

అదేమిటంటే నయనతార సన్యాసం స్వీకరించాలని తలుస్తున్నారట. నిజానికి నయనతార నట జీవితం ఉజ్వలంగా సాగుతోంది. సెకండ్ ఇన్నింగ్స్‌లోను సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా కొనసాగుతున్న అరుదైన నటీమణుల్లో ఒకరీమె. రాజారాణి, ఆరంభం, ఇదు కదిర్‌వేల్ కాదల్ లాంటి చిత్రాల విజయాలు నయనతారకు సెకండ్ ఇన్నింగ్‌లో చాలా హెల్ప్ అయ్యాయి. ఈ మధ్య వచ్చిన అన్భే నీ ఎంగే చిత్రం నిరాశ పరచినా నటిగా ఆమె కెరీర్‌కు ఎలాంటి ఢోకా లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఈ సంచలన నటి సూర్యతో మాస్, ఉదయనిధి సరసన నన్భేండా, జయంరవికి జంటగా తనీ ఒరువన్ చిత్రాలతో పాటు లేడి ఓరియంటెడ్ చిత్రం మాయ  చేస్తూ బిజీగా వున్నారు.అయితే వ్యక్తిగత జీవితంలో ఈ బ్యూటీ రెండు మూడుసార్లు ప్రేమలో ఓడిపోయారు. నటుడు శింబు, ప్రభుదేవాలతో ప్రేమ కథలు కంచికి చేరడంతో విరక్తి చెందిన నయనతార ప్రేమ, పెళ్లి వద్దు అయ్యాయి కనుక సన్యాసం స్వీకరించాలనే నిర్ణయానికి వచ్చారా అనే వార్త ప్రచారంలో ఉంది. ఇది చిత్ర పరిశ్రమను విస్మయం కలిగించిన వార్త. అంతేకాదు ఏడాది క్రితం ఈ భామ హిమాలయాలకు వెళ్లి అక్కడి సన్యాసులతో మాట్లాడి మనశ్శాంతి పొందారట. ఇంతకుముందు బాలీవుడ్ బ్యూటీ తనుశ్రీ దత్తా, కోలీవుడ్ నటి రాగసుధ లాంటి వారు సన్యాసం పుచ్చుకున్నారు.