దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్ల నిందితుడి అరెస్ట్

Posted On:12-01-2015
No.Of Views:286

బెంగళూరు బాంబు పేలుళ్ల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో నిందితుడు,  ఉగ్ర కార్యకలాపాల్లో కీలకుడిగా వ్యవహరిస్తున్న సయ్యద్ ఇస్మాయిల్ అఫక్  పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో అఫక్ పలు కీలక విషయాలు వెల్లడించినట్లు సమాచారం. దేశవ్యాప్తంగా పలు పేలుళ్లతో అతనికి సంబంధం ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.అలాగే దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల బాంబులను కూడా తానే తయారు చేసినట్లు అఫక్ ఒప్పుకున్నట్లు సమాచారం. పాకిస్తాన్ తీవ్రవాద సంస్థలతోనూ అఫక్కు సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. బెంగళూరు పోలీసులు విచారణను కొనసాగిస్తున్నారు.  కాగా అఫక్ను హైదరాబాద్ పోలీసులు త్వరలో కస్టడీలోకి తీసుకోనున్నారు. మరోవైపు ఎన్ఐఏ అధికారులు అఫక్ను పీటీ వారెంట్పై హైదరాబాద్ తీసుకు రానున్నారు. కాగా  డిసెంబర్ 27న బెంగళూరులో బాంబు పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు.