నాటి హీరోయిన్‌ను పోల్చుకున్నారా!?

Posted On:12-01-2015
No.Of Views:379

అప్పుడు అందంతో యవ హృదయాలను కట్టి పడేసిన కలల రాకుమారి ఇప్పుడు కళ్లు లోతుకు పోయి,ముఖం పీక్కుకుపోయి, బక్కపల్చగా మారిపోయి, ఎవరూ గుర్తు పట్టనట్లుగా ఉన్న హీరోయిన్‌ను ఇప్పటి వరకు ఎవరూ పోల్చుకోలేకపోయారు. ఈమె 1990లో వచ్చిన ‘బ్లాక్‌బస్టర్‌’ ఆష్‌కీ హీరోయిన్‌ ‘అనూ అగ్రవాల్‌’. ఈ ఒక్కసినిమానే ఆమెకు అగ్రహీరోయిన్‌ రేంజ్‌ను తీసుకువచ్చింది. ఆ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ,ఆమె నిలదొక్కుకోలేకపోయింది.సినిమాలు లేక, చేతిలో చిల్లిగవ్వలేక, అనారోగ్యం పాలై చివరకు ఇలా దర్శనమిస్తోంది.