దర్మక`నిర్మాత విబి రాజేంద్రప్రసాద్‌ కన్నుమూత

Posted On:12-01-2015
No.Of Views:302

కొత్త సంవత్సరం కూడా సినిమా పరిశ్రమను వదలనట్లుంది. మొన్ననే ఆహుతి ప్రసాద్‌ను లాక్కెళ్లిన మృత్యువు. ఇప్పుడు ప్రముఖ నిర్మాత`దర్శకుడు వి.బి రాజేంద్ర ప్రసాద్‌(97)ను కౌగిలించుకుంది. ప్రముఖ కథానాయకుడు,లెజెండ్‌తో విలన్‌గా మారిన జగపతిబాబు,వి.బి మూడో కుమారుడు. సినిమాల్లో కథానాయకుడు కావాలన్న లక్ష్యంతో కృష్ణాజిల్లా డోకిపర్రునుంచి వచ్చిన వీరమాచనేని రాజేంద్రప్రసాద్‌,ఇంటి నుంచి తెచ్చిన యాభై వేలరూపాయలతో నిర్మాతగా మారి ‘అన్నపూర్ణ’ తీశారు. ఇది కాస్తంత లాభాలు పండిరచడంతో భాగస్వామితో ‘ఆరాధన(1962)’ సినిమా తీశారు. భాగస్వామి మరణించడంతో తన మూడో కుమారుని పేరిట ‘జగపతి’ఆర్ట్‌  పతాకాన్ని ప్రారంభి స్వీయ దర్శకత్వంలో ‘దసరాబుల్లోడు’ సినిమాను నిర్మించారు. అప్పట్లో అది సూపర్‌హిట్టు. జగపతి సంస్థపై 34 సినిమాలు నిర్మించారు. అందులో 28 హిట్‌ సినిమాలే. జగపతిబాబును హీరోగా అరంగేట్రం చేయిస్తూ తీసిన సినిమా, ఆ తర్వాత రెండో సినిమా రెండు ఆయన్ను అప్పుల పాలు చేసింది. ఆ తర్వాత జగపతిబాబు హీరోగా నెమ్మది నెమ్మదిగా నిలదొక్కుకోవడంతో అప్పుల్లోంచి బయటపడ్డారు. అప్పటి నుంచి విబి సినిమాలు వదిలేసి, దైవసాన్నిధ్యంలో ఎక్కువగా గడపడం, మధ్యలో ఫిల్మ్‌ సోసైటీ బాధ్యతలు చూసుకోవడం మొదలు పెట్టారు. వైఎస్‌ హయాంలో ఆయనకు రఘుపతి వెంకటరత్నం అవార్డు కూడా అందుకున్నారు. అనారోగ్యంతో ఆయన కన్నుమూశారు. ఆయన మృతికి ‘అక్షరం’ నివాళులర్పిస్తోంది.