ప్రముఖ చరిత్రకారులు నశీర్‌ అహ్మద్‌కు కువైట్‌ ఆహ్వానం

Posted On:12-01-2015
No.Of Views:383
ప్రముఖ చరిత్రకారులు,సీనియర్‌ పాత్రికేయులు సయ్యద్‌ నశీర్‌ అహ్మద్‌కు కువైట్‌లోని తెలుగు ప్రజల ఆహ్వానం అందింది. ఈ మేరకు ఆయన అక్కడ జరిగే కార్యక్రమంలో పాల్గొని సన్మానాన్ని అందుకోనున్నారు. ముస్లిం చరిత్రకారుడిగా వాసికెక్కిన ఆయన గురించి ఇటీవల కువైట్‌ నుంచి ప్రచురించబడే ‘నెలవంక’ మాసపత్రికలో సయ్యద్‌ నశీర్‌ అహ్మద్‌ గురించి వివరంగా వ్యాసం వచ్చింది. ఒక తెలుగు చరిత్రకారుడికి లభించిన గుర్తింపుగా చెప్పుకోవచ్చు. ఆయనకు ‘అక్షరం’ తరఫున శుభాభినందనలు