ఇస్రో ఛైర్మన్‌గా ఆలూరి కిరణ్‌కుమార్

Posted On:12-01-2015
No.Of Views:362

 నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ(ఇస్రో) నూతన ఛైర్మన్‌గా ఆలూరి కిరణ్‌కుమార్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 1975 నుంచి ఇస్రోలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. చంద్రయాన్-1, మంగళ్‌యాన్ తదితర ఉపగ్రహ ప్రయోగాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన కిరణ్‌కుమార్ మూడేళ్ల పాటు ఇస్రో ఛైర్మన్ పదవిలో కొనసాగుతారు. ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్ డిసెంబరు 31న పదవీవిరమణ చేయగా, ఆయన స్థానంలో శైలేష్‌నాయక్‌కు తాత్కాలిక బాధ్యతలు అప్పగించిన విషయం తెలిసిందే.