మీలో ఎవరు కోటీశ్వరుడికి తగ్గిన ఆదరణ

Posted On:12-01-2015
No.Of Views:382

టివి షోలలో టాప్‌ ఫైవ్‌గా ఉన్న మాటీవీ ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ నాగ్‌ షోకు ఆదరణ క్రమేపీ తగ్గుతుందని టిఆర్పీ రేటింగ్‌ స్పష్టం చేస్తోంది. నిజమా అంటూ మీరు విప్పారిన నేత్రాలతో చూసినా అంతే ఈ షోకు రోజు రోజుకూ ఆదరణ తగ్గుతుందని టీఆర్పీ రేటింగ్‌ చెబుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో సమంత,నితిన్‌,వరుణ్‌తేజ్‌,పూజాహెగ్డే,రకుల్‌ప్రీత్‌ వంటి యూత్‌ ఫాలోయింగ్‌ ఉన్న హీరో,హీరోయిన్లను తీసుకొచ్చి ఎంఇకె షోలో కూర్చోబెట్టినప్పటికీ టీఆర్పీ రేటింగ్‌ పదిని దాటి ససేమిరా పైకి వెళ్లనంటుంది. నాగార్జున చరిష్మాతో మొదటి ఇన్నింగ్స్‌ దిగ్విజయంగా సాగిపోయింది. ఇప్పుడు ఇది పని చేయడం లేదు. మరి మాటీవి టీం టీఆర్పీ రేటింగ్‌ పెంచేందుకు కొత్త మసాలాలు అద్దాలి.