కంటోన్మెంట్‌ మొదటి వార్డులో ప్రతాప్‌(టీఆర్‌ఎస్‌) ఓటమి

Posted On:12-01-2015
No.Of Views:346
 సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. లెక్కింపులో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌కు తొలి ఎదురుదెబ్బ తగిలింది. మొదటి వార్డులో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ప్రతాప్‌ ఓటమి చెందాడు. ప్రతాప్‌పై పార్టీ రెబల్‌ అభ్యర్థి జక్కుల మహేశ్వర్‌రెడ్డి గెలుపొందారు. 863 ఓట్ల తేడాతో మహేశ్వర్‌రెడ్డి విజయం సాధించాడు. మరికాసేపట్లో 8 వార్డుల్లో ఫలితాలు తేలనున్నాయి. కౌంటింగ్‌ నేపథ్యంలో లెక్కింపు కేంద్రాల్లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. 8 వార్డుల్లో మొత్తం 114 అభ్యర్థులు బరిలో నిలిచారు