ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రేసులో డీఎస్‌!

Posted On:13-01-2015
No.Of Views:357

 కాంగ్రెస్‌ మండ లి పక్ష నేత డి. శ్రీనివాస్‌ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవి రేసులో ఉన్నారు. త్వరలో విస్తరించనున్న ఏఐసీసీ కార్యవర్గంలో తనకు అవకాశం లభిస్తే పదవిని చేపట్టాలన్న యోచనలో డీఎస్‌ ఉన్నట్లు ఆయ న సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే రెండుసార్లు పీసీసీ అధ్యక్షుడిగా చేసిన అనుభవం ఉండడం, ఇందిరాగాంధీ కుటుంబంతో సాన్నిహిత్య ం కలిగి ఉన్న నేపథ్యంలో ఆయనకు ఈసారి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవి లభించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పైగా పీసీసీ అధ్యక్షుడిగా చేసినవారికి జాతీయ ప్రధాన కార్యదర్శి పదవులు ఇవ్వడం కాంగ్రెస్‌లో ఆనవాయితీ. ఎమ్మెల్సీ పదవిపై కూడా ఆయనకు అవకాశాలున్నాయన్నది సన్నిహితుల అభిప్రాయం. మార్చిలో ఆయ న ఎమ్మెల్సీ పదవి కాలం ముగియనుంది. డీఎస్‌ స్థానంతో పాటు మరో ఐదు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య ఆధారంగా ఒక ఎమ్మెల్సీ లభించే అవకాశముంది. డీఎస్‌కే తిరిగి అవకాశం లభించవచ్చని పార్టీ వర్గాలు అంటు న్నాయి. అయితే ఏ విషయం అనేదానిపై త్వరలో స్పష్టత వస్తుందని చెబుతున్నాయి. కాగా పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి ఎస్‌. జైపాల్‌రెడ్డికి త్వరలో విస్తరించే కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ)లో చోటు దక్కవచ్చంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ నుంచి సీడబ్ల్యూసీలో ఎవరికీ చోటు లేకపోవడంతో రాష్ట్రానికి అధిష్ఠానం అత్యంత ప్రాధాన్యమిస్తున్న దృష్ట్యా ఆయనకు అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తోంది.