సొంత ఊళ్లో చంద్రబాబు, ఫాంహౌస్లో కేసీఆర్ సంక్రాంతి సంబురాలు ​

Posted On:14-01-2015
No.Of Views:343

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంక్రాంతి సంబురాలు జరుపుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తన స్వగ్రామంలో సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటే తెలంగాణ సీఎం కేసీఆర్ తన ఫాంహౌజ్లో కుటుంబ సభ్యులతో కలిసి పండుగ చేసుకోనున్నారు. ఆయన బుధవారం సాయంత్రం ఫాంహౌజ్ కు వెళ్లనున్నారు.ఇక చంద్రబాబు నాయుడు బుధవారం  సొంత ఊరైన నారావారిపల్లిలో సందడి చేశారు. సంక్రాంతి ఉత్సవాలకు హాజరయ్యారు. ఆయన...కుటుంబ సభ్యులతో కలిసి నారావారిపల్లెలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి చేశారు. అనంతరం ఆయన తల్లిదండ్రుల సమాధుల వద్దకు చేరి వారికి నివాళి అర్పించారు. నారావారిపల్లె చుట్టుపక్కల గ్రామాల ప్రజలు  పెద్ద ఎత్తున తరలివచ్చారు. చంద్రబాబుకు వినతిపత్రాలు సమర్పించడాని పోటీపడ్డారు. దీంతో భద్రత సిబ్బంది వారిని అడ్డుకోవడంతో కొంత గందరగోళం నెలకొంది.