రేపిస్ట్ అరెస్ట్

Posted On:14-01-2015
No.Of Views:320

 నగరంలో ఒంటరిగా వెళ్తున్న మహిళలపై అత్యాచారానికి పాల్పుడుతున్న కరడుగట్టిన రేపిస్ట్, ఆటోడ్రైవర్ రవిని నగర పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని పోలీసు స్టేషన్కు తరలించారు. పోలీసులు తమదైన శైలిలో రవిని విచారిస్తున్నారు. అతడిపై పలు రేప్ కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. నగరంలో ఒంటరిగా ఉన్న మహిళలను రవి తన ఆటోలో ఎక్కించుకుని... నగర శివారు ప్రాంతాలకు తీసుకు వెళ్లేవాడు.అక్కడ మహిళను బెదిరించి వారి వద్ద నుంచి నగదు, బంగారం దొంగిలించి.. ఆపై వారిపై అత్యాచారం చేసి పరారైయ్యేవాడు. దాంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి... నిందితుడు రవి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆ క్రమంలో బుధవారం నిందితుడు రవి పోలీసులకు చిక్కాడు.