రంగంలోకి కిరణ్‌బేడీ

Posted On:15-01-2015
No.Of Views:316

ఢల్లీి వీధుల్లో ఒక్కరోజులో కోటి రూపాయల విరాళాన్ని పోగేసుకున్న ‘అప్‌’ పార్టీ ప్రాబల్యాన్ని చూసి బిజెపి కంగుతింది.  కేజ్రీవాల్‌ వ్యూహాన్ని దెబ్బ తీసేందుకు కిరణ్‌బేడీని బిజెపి రంగంలోకి దింపింది. ఆమెను వెంటనే పార్టీలో చేర్చుకోవడమే కాకుండా సీఎం అభ్యర్థిగా బిజెపి ప్రకటించింది. 
 సామాన్యుడిలా ప్రచారానికి వెళ్తూ ఢల్లీి ప్రజల ఆదరాభిమానాలను పొందుతున్న కేజ్రీవాల్‌కు మాజీ పోలీస్‌ అధికారిణి కిరణ్‌బేడీ సమఉజ్జీ కాగలరా? ఇప్పటికే కాంగ్రెస్‌ పార్టీ చేతులెత్తేసినట్లే. హ్యాట్రిక్‌ సాధించిన షీలాదీక్షిత్‌ ఈఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. దాంతో కాంగ్రెస్‌ కొత్త ముఖాలను వెతుక్కునే పనిలో పడిరది. అయితే రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కుమార్తె షర్మిష్టా ముఖర్జీకి గ్రేటర్‌ కైలాస్‌ టికెట్టు ఇవ్వడంపై,అంతరార్థం ఏమిటో తెలియడంలేదు. సీఎం అభ్యర్థి ఎవరో కాంగ్రెస్‌ ప్రకటించకపోయినా కొత్తరక్తాన్ని నింపుతున్న భావన కల్పించడం ద్వారా యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోందని అర్థమైంది. ఇప్పుడు ఢల్లీి తెరపై కేజ్రీవాల్‌,కిరణ్‌బేడీ మధ్యే పోటీ ఉంటుందని తెలిసిపోతూనే ఉంది. ఢల్లీిని ఎలాగైనా చేజిక్కించుకోవాలని మోదీ సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు.