సోనియాపై వివాద పుస్తకం

Posted On:15-01-2015
No.Of Views:339

సోనియాగాంధీపై స్పానిష్‌ రచయిత జేవియర్‌ మారో రాసిన వివాదాస్పద గ్రంథం ‘ఎల్‌ సారి రోజో(2008)’ఆంగ్ల అనువాదం(రెడ్‌ శారీ పేరిట) భారత్‌లో విడుదల కాబోతోంది.  ఈ గ్రంథ ప్రచురణపై కాంగ్రెస్‌ పార్టీ అభ్యంతరం తెలిపింది కూడా.ఆంగ్లంలో ఈ గ్రంథాన్ని ప్రచురించిన రోలీ బుక్స్‌ సంపాదక వర్గ డైరెక్టర్‌ ప్రియాకపూర్‌ పుస్తకం విడుదలైనట్లుగా ట్వీట్‌ చేశారు. స్పానిష్‌లో 2008లో ఈ పుస్తకం విడుదలయ్యింది. దీనిపై కాంగ్రెస్‌ న్యాయవాదులు 2010లో లీగల్‌ నోటీసు పంపారు. ఇందులో రచయిత పేర్కొన్న అంశాలన్నీ అబద్ధమని వారు పేర్కొన్నారు. అయినప్పటికీ పుస్తకం విడుదలైంది.  455 పేజీలున్న ఆంగ్లగ్రంథం ‘రెడ్‌శారీ’కి 395రూపాయల ధరను నిర్ణయించారు. ఇది 17 భాషల్లో అనువాదం కాబోతోంది. ఇందులో ఏముందీ? పుస్తకం తెరిస్తేనే అసలు విషయం బయటపడుతుంది. సోనియా బాల్యం,రాజీవ్‌తో ప్రేమ`పెళ్లి, ఆమె అల్లుడు రాబర్డ్‌వాద్రా భూముల వ్యవహారం వరకు ఇందులో ఉన్నాయి(ట). మొత్తానికి చితికిపోతున్న కాంగ్రెస్‌కు ఈ గ్రంథం మరింత ఇబ్బందికరంగా మారబోతుందని బిజెపి సంబరపడిపోతుందట.