ఫస్ట్‌ ఫెయిల్యూర్‌

Posted On:15-01-2015
No.Of Views:372

శంకర్‌ సినిమా తీశాడంటే సూపర్‌ హిట్టే! అని టాలీవుడ్‌,బాలీవుడ్‌,కోలీవుడ్‌,సందల్‌వుడ్‌తో పాటు హాలీవుడ్‌ కూడా అనుకునేది. మొట్ట మొదటిసారి ఈ అంచనాలన్నీ తప్పాయి. శంకర్‌ తీసిన ‘ఐ’ భారీ చిత్రం బాక్సాఫీసు వద్ద కుదేలైనట్లు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. 
టెక్నాలజీ పరంగా సినిమా గొప్పగా ఉంది. విక్రమ్‌ నటన సూపర్‌. మరి,మూడు గంటల పాటు సినిమాను చూడటమే ఇబ్బంది అని ప్రేక్షకులు అంటున్నారు.
 ఫస్టాఫ్‌లో సంతానం కామెడీ కాస్త నవ్వించింది. ఆ తర్వాత సినిమా అంతా సీరియెస్‌గా నడుస్తోంది. కొత్త కథనం,చక్కని స్క్రీన్‌ప్లే రాసుకొని సెట్‌లోకి అడుగుపెట్టే శంకర్‌ ఈ సారి బోల్తా పడినట్లు ఈ సినిమాను చూస్తే తెలిసిపోతుంది. హాలీవుడ్‌ రేంజీలో సినిమా తీశాడు. కానీ మన ప్రేక్షకుల టేస్ట్‌ను మర్చిపోయాడన్న విమర్శలు వస్తున్నాయి. ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించిందని చెప్పొచ్చు. టెక్నాలజీ పరంగా సినిమా ఓకే. శంకర్‌,విక్రమ్‌ సినిమా అని థియేటర్‌కు వెళ్లాల్సిందే!