‘జయప్రదం’గా బిజెపివైపు?

Posted On:15-01-2015
No.Of Views:333

సహజమైన అందాలరాశిగా ‘సత్యజిత్‌రే’తో ప్రశంసలు పొందిన జయప్రద ఇప్పుడు బిజెపి వైపు నెమ్మది నెమ్మదిగా అడుగులు వేస్తున్నారు. తొలుత టిడిపిలో చేరిన జయప్రద, ఆ తర్వాత ఆ పార్టీతో విభేదాల కారణంగా సమాజ్‌వాదీ పార్టీలో చేరి, రాంపూర్‌ స్థానం నుంచి గెలుపొందారు.యుపిలో ఆమె రాజకీయ గురువు అమర్‌సింగ్‌,ములాయంతో విభేదించి, సొంత పార్టీ పెట్టుకున్నారు. ఆయనతోపాటే ఎస్పీ నుంచి బయటికి వచ్చిన జయప్రద రాంపూర్‌లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఆమె ఏ పార్టీలో చేరాలా అన్న దానిపై సన్నిహితులతో చర్చలు జరిపారు. కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని భావించినప్పటికీ ప్రస్తుతం  పార్టీ కోలుకునే పరిస్థితి లేదు. కనుక బిజెపిలో చేరితే భవిష్యత్తు ఉంటుందని ఆమె భావిస్తున్నారు. ఇటీవల కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ద్వారా అమిత్‌షాను కలిసినట్లు వినిపిస్తోంది. అయితే మోదీ పాలనను జయప్రద ప్రశంసించడం కూడా ఆమె బిజెపిలో చేరిక ఖాయమనే వినిపిస్తోంది. ఏదైనా ఒకటి రెండు  రోజుల్లో జయప్రద స్వయంగా ప్రకటన చేయబోతున్నట్లు వినిపిస్తోంది.