మళ్లీ మల్టీస్టారర్‌లో పవన్‌కళ్యాణ్‌

Posted On:17-01-2015
No.Of Views:319

వెంకటేష్‌తో ’గోపాల..గోపాల’ మల్టీస్టారర్‌ చిత్రం విజయవంతమవ్వడంతో మరో చిత్రంలో నటించేందుకు పవన్‌ కళ్యాణ్‌ అంగీకారం తెలిపినట్లు వినికిడి. ఈ చిత్రంలో నటించే అగ్రహీరో ఇంకా ఎవరో తేలాలి. మహేష్‌బాబు లేదా ప్రభాస్‌ పేర్లు వినిపిస్తున్నాయి. మొత్తానికి స్టోరీపై చర్చ జరుగుతుంది. స్టోరీ ఫైనల్‌ అయితే,  ఆ తర్వాత హీరోల డేట్స్‌ను బట్టి, రెండో కథానాయకుడెవరో   బయటికి వస్తాడని పరిశ్రమ వర్గాల కథనం. తనను ప్రభావితం చేయగల కథ లభిస్తే, ఏ హీరోతోనైనా నటిస్తానని పవన్‌ కళ్యాణ్‌ చెబుతున్నారు. పవన్‌ కళ్యాణ్‌ మొత్తానికి మళ్లీ బిజీ అయిపోయాడు.  గబ్బర్‌సింగ్‌`2 పూర్తయిన తర్వాత కొత్త చిత్రాలు మొదలవుతాయి.ఇప్పుడు మూడు సినిమాలు పవన్‌ చేతిలో ఉన్నాయి. బాబీ దర్శకత్వంలో వస్తున్న గబ్బర్‌సింగ్‌`2తో పాటు తన మిత్రుడు త్రివిక్రమ్‌, డాలీ చిత్రాలు సెట్స్‌పైకి రానున్నాయి. ఇవి రెండు ‘అత్తారింటికి దారేది’ తరహా కుటుంబ తరహా వినోదాన్ని అందిస్తాయని పవన్‌ చెబుతున్నారు.