తెలుగుసినిమాను డైరెక్షన్‌ చేస్తున్న ప్రభాకర్‌

Posted On:17-01-2015
No.Of Views:292

తెలుగు బుల్లితెర మెగాస్టార్‌ పొడకండ్ల ప్రభాకర్‌ మెగాఫోన్‌ చేబట్టబోతున్నారు. ఆయన ఇప్పటికే బుల్లి బుల్లి పాత్రల ద్వారా టాలీవుడ్‌కు ఎంటరైనప్పటికీ, నటన కన్నా దర్శకత్వంపైనే మోజెక్కువ. పదిహేనేళ్లుగా టివి,సినిమా మాధ్యమాల్లో ఉన్నప్పటికీ సరైన బ్రేక్‌రాలేదని ప్రభాకర్‌ భావిస్తున్నారు. కొత్త సబ్జెక్టుతో డిఫరెంట్‌గా సినిమా తీస్తే బాగుంటుందని కష్టపడి ఒక కథ రాసుకొని అల్లు అరవింద్‌తో పాటు పలువురు స్టార్‌ ప్రొడ్యూసర్లకు వినిపించాడట. అయితే అల్లు అరవింద్‌ను ప్రభాకర్‌ చెప్పిన కథ ఇన్‌స్పైర్‌ చేసిందట. ఈ సినిమా చేద్దామని హామీ ఇచ్చినట్లు టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన హామీ మేరకు ప్రభాకర్‌ సినిమా నిర్మాణానికి సంబంధించిన నటీనటుల ఎంపిక, లొకేషన్స్‌,ఇతర ఏర్పాట్లల్లో బిజిగా ఉన్నాట్ట! సృజనాత్మకత పాళ్లు ఎక్కువగా ఉన్న ప్రభాకర్‌ రూపొందించిన అనేక టివి కార్యక్రమాలు విజయవంతమయ్యాయి. ఇప్పుడు అదే పంథాలో జనరంజకంగా ఉండేలా,యూత్‌ను ఎట్రాక్ట్‌ చేసేలా చిత్రాన్ని రూపొందించే పనిలో ప్రభాకర్‌ పడ్డారట. ఏమైనా ప్రభాకర్‌ టాలీవుడ్‌లోనూ సక్సెస్‌ అవ్వాలని కోరుకుందాం.