ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు

Posted On:17-01-2015
No.Of Views:310

నల్గొండ జిల్లా మునగాల మండలంలోని ముకుందాపురం గ్రామంలో శనివారం రాత్రి పొద్దుపోయాక 65వ నెంబర్ రాష్ట్ర రహదారిపై పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి నుంచి హైదరాబాదుకు వస్తున్న కావేరి ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేటు బస్సు రోడ్డుపై నుంచి పాకను ఢీకొని ఆ పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది. ఇంటి గోడను ఢీకొనడంతో దర్వాజ ప్రాంతంలో ధ్వంసమైంది. ఆ ఇంటికి చెందిన కుటుంబ సభ్యులు రెండో గదిలో నిద్రించడంతో ప్రమాదం తప్పింది. ప్రమాద ఘటనలో పాకలోని ఒకరికి, బస్సు డ్రైవర్‌తోపాటు మరో ఇద్దరు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సు కుదుపునకు గురవడంతో ప్రయాణికులకు కూడా కొందరికి పాక్షికంగా గాయాలయ్యాయి. సందీప్ (28), కుమార్ (ఏలూరు), మదాత్ సైదులు పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే 108 సాయంతో వారిని కోదాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన వెంటనే స్థానికులు పెద్దమొత్తంలో గుమిగూడారు. పోలీసులు వచ్చి క్షతగాత్రులను రక్షించి ప్రమాద సంఘటన తీరును పరిశీలించారు.