ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన చంద్రబాబు

Posted On:17-01-2015
No.Of Views:311

నందమూరి తారకరామారావు వర్థంతి సందర్భంగా ఎన్టీఆర్‌ఘాట్ వద్ద ఏపీ ముఖ్యమంత్రి, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. అనంతరం సర్వమత ప్రార్థనలో పాల్గొన్నారు.  భావి తరాలకు ఎన్టీఆర్ ఆదర్శమని, ఆయన సేవలను కొనియాడారు. ఎన్టీఆర్‌కు భారత రత్న వచ్చేలా కృషి చేస్తామన్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి, ఏపీ మంత్రులు కేఈ కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు, తెదేపానేతలు ఎల్.రమణ, మోత్కుపల్లి నర్సింహులు, పెద్దిరెడ్డి, తలసాని కృష్ణయాదవ్ తదితరులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన వారిలో ఉన్నారు.