కాంగ్రెస్ సీనియర్ నేత పాలడుగు వెంకట్రావు కన్నుమూత

Posted On:19-01-2015
No.Of Views:264

 : కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు(75) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. పాలడుగు వెంకట్రావు స్వస్థలం కృష్ణా జిల్లా ముసనూరు మండలం గోగులంపాడు. 1968లో యువజన కాంగ్రెస్‌లో చేరిన పాలడుగు 1972లో తొలిసారి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. నూజివీడు శాసనసభ స్థానం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంజయ్య, భవనం వెంకట్రామిరెడ్డి, నేదురుమల్లి కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. పాలడుగు ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.