సెన్సార్ బోర్డు ఛైర్‌పర్సన్‌గా పహ్లాజ్ నిహలాని

Posted On:19-01-2015
No.Of Views:328

 సెన్సార్ బోర్డు కొత్త ఛైర్‌పర్సన్‌గా పహ్లాజ్ నిహలానిని, 9 మంది సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సెన్సార్ బోర్డు ఛైర్‌పర్సన్‌గా ఉన్న లీలా శామ్సన్, సభ్యులు గతవారం రాజీనామా చేయడంతో కేంద్ర ప్రభుత్వం కొత్త ఛైర్‌పర్సన్‌ను, సభ్యులను నియమించింది. పహ్లాజ్ నిహలాని బాలీవుడ్‌లో నిర్మాతగా సుపరిచితులు. ఆంఖే, తలాశ్, షోలా ఔర్ షబ్నమ్ లాంటి చిత్రాలను ఆయన నిర్మించారు. తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన నటి జీవితను సెన్సార్ బోర్డు సభ్యురాలిగా నియమించారు.