పోలీయో చుక్కలు వికటించి చిన్నారి మృతి

Posted On:19-01-2015
No.Of Views:339


పోలియో చుక్కలు వికటించి మూడు నెలల చిన్నారి మృతి చెందింది. జిల్లాలోని రామాపురం మండలం వీబీ కాలనీలో సోమవారం ఈ ఘటన జరిగింది. నాగరాజు, రెడ్డమ్మ దంపతుల కుమార్తెకు ఆదివారం నిర్వహించిన పల్స్‌పోలియో కార్యక్రమంలో అధికారులు పోలియో చుక్కలు వేశారు. అయితే ఆ మందు వికటించి ఆ చిన్నారి మృతి చెందినట్లు తల్లిదండ్రులు పేర్కొన్నారు. అదే గ్రామానికి చెందిన మరో ఇద్దరు చిన్నారులు పోలియో చుక్కల కారణంగా అస్వస్థతకు గురైనట్లు తెలిసింది.