వచ్చే నెలలో జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు: అల్లం

Posted On:19-01-2015
No.Of Views:311

 వచ్చే నెలలో రాష్ట్రంలోని జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. ఆయన కరీంనగర్ మీదుగా గోదావరిఖనికి వెళ్తుండగా మార్గమధ్యలో నగరానికి చెందిన టీయూడబ్ల్యూజే నాయకులు కలిశారు. తమ సమస్యలను వివరించారు. అకాడమీ చైర్మన్ నారాయణ మాట్లాడుతూ, ప్రభుత్వోద్యోగులకు ఇచ్చిన హెల్త్‌కార్డుల విషయంలో తలెత్తిన సాంకేతిక కారణాల వల్ల జర్నలిస్టులకు కార్డుల పంపిణీలో కొంత ఆలస్యమైందన్నారు. నగరంలో జర్నలిస్టులకు రెండో విడత ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కృషి చేయనున్నట్లు తెలిపారు.