ఇందుకేనా పార్టీలో చేరింది!?

Posted On:19-01-2015
No.Of Views:307

జీవిత`రాజశేఖర్‌ దంపతులు టిడిపి నుంచి కాంగ్రెస్‌కు,అక్కడ నుండి వైఎస్సార్‌సిపికి చివరకు బిజెపిలో చేరారు. ఏ పదవి ఇవ్వకున్నా, ప్రతీరోజూ జీవిత పార్టీ కార్యాలయానికి వచ్చి వెళ్లడం, విలేకరుల సమావేశంలో పాల్గొనడం, పార్టీ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడంతో  అనతికాలంలోనే పార్టీలో గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే బిజెపి కేంద్రంలో అధికారంలో రావడంతో జీవితకు పార్టీలో కాని మరేదైనా మంచి పదవి లభిస్తుందని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా ఆమెకు సెన్సార్‌బోర్డు సభ్యురాలిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యారు. దాంతో ఆమె అవాక్కైనట్లు వినిపిస్తోంది. ఈ పోస్టు కోసమేనా? తాను బిజెపిలో చేరిందని,సన్నిహితుల వద్ద వాపోయినట్లు వినిపిస్తోంది. అయితే ఏదో ఒకటి తీసుకొమ్మని, భవిష్యత్తులో మంచి పోస్టులు వస్తాయని సన్నిహితులు చెప్పడంతో ఆమె అంగీకరించినట్లు వినికిడి.