చైనా ఆర్థిక వ్యవస్థ అధ్వాన్నం

Posted On:19-01-2015
No.Of Views:309

ప్రపంచంలోనే రెండో అత్యధిక ఆర్థిక వ్యవస్థ కలిగి,సంపన్నదేశంగా వాసికెక్కిన చైనా ఆర్థిక వ్యవస్థ రోజు రోజుకూ దిగజారుతుందా!? ఇది నమ్మశక్యం కాని విషయం. కానీ లెక్కలు తీస్తే ఊహించని విధంగా చైనా ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుంది. ఇది నిజం!
2015లో ప్రధమార్థంలో 7శాతం పెరిగి కాస్తంత తెరిపినిచ్చినప్పటికీ వచ్చే ఏడు 6.8శాతానికి పడిపోతుందని అంచనా. ఆ తర్వాత ఆరుశాతానికి పడిపోయినా ఆశ్చర్యపడక తప్పదని దాదాపు 40 మంది చైనా ఆర్థికవేత్తలు కుండలు బద్ధలు కొట్టారు.  ఈనెల 15 నుంచి 19 ఈ సర్వే నిర్వహించారు.గత ఏడాది చైనా  ఆర్థికాభివృద్ధి 7.2గా చూపిస్తోంది. నెమ్మది నెమ్మదిగా దేశంలో సంభవిస్తున్న ఆర్థిక సంక్షోభం పరిస్థితి అధ్వాన్నంగా మారిందన్నది ఆర్థికవేత్తల భావన. అందుకే అంటారేమో పెరుగుట..విరుగుట కొరకేనని. చైనీయులు ఇప్పటి నుంచే జాగ్రత్త పడాలి మరి!