ముంబైవాసి చికాగో ‘రియల్‌’రికార్డు

Posted On:19-01-2015
No.Of Views:304

ముంబయిలో పుట్టాడు. చికాగోకు వెళ్లి అక్కడ సాంకేతిక రంగంలో పారిశ్రామిక వేత్తగా ఎదిగాడు. అంతేనా.. చికాగో సమీపంలోని విండిసిటిలో బాగా పేరున్న ట్రంప్‌ టవర్‌లో 89వ ఫ్లోర్‌లో పెంట్‌హౌజ్‌(15,000 చ.అ)ను 17 మిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసి రికార్డు సృష్టించాడు. ఇది చికాగో రియల్‌ ఎస్టేట్‌ చరిత్రలో ఇదో పెద్ద రికార్డు. ఆయన తల్లితండ్రులే దిగువన 1200 చ. అ. స్థలమున్న ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. ఇన్ని రికార్డులు సాధించిన పారిశ్రామిక వేత్త పేరు సంజయ్‌షా.  బాబి జిందాల్‌ తల్లితండ్రులకు అమెరికన్‌ కల ఉండేది. దాన్ని జిందాల్‌ పూర్తి చేశాడు. అదే విధంగా సంజయ్‌షా కూడా అలాంటి అమెరికన్‌ డ్రీమ్‌ను పూర్తి చేసి, తల్లితండ్రులను సంతోషపెట్టాడు.ప్రస్తుతం వీరుంటున్నది విండి సిటిలోనే. ఇక్కడ నుండి చికాగోకు చేరుకోవాలంటే 45 నిమిషాల వ్యవధి పడుతుంది.