‘ఇస్లాం’ స్వీకరించిన నటి మౌనిక

Posted On:19-01-2015
No.Of Views:473

దక్షిణాది భాషల నటీమణి మౌనిక ‘ఇస్లాం’మతాన్ని స్వీకరించి అందర్నీ ఆశ్చర్యపర్చింది. ఇప్పుడు ఆమె తన పేరును ‘రహిమా’గా మార్చుకుంది. తమిళ చిత్రం ‘ఆజ్‌గీ’లో నటించి ఎంతో పేరు తెచ్చుకున్న మౌనిక,మరికొన్ని చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. గత ఏడాది ఆమె కేరీర్‌ గ్రాఫ్‌ ఒక్కసారే పైకి వెళ్లింది. ఈ దశలో చేతి నిండా సినిమాలున్నప్పుడే చెన్నైకు చెందిన పారిశ్రామిక వేత్త మాలిక్‌తో మదురైలో పరిచయం కలిగింది. ఈ పరిచయం ప్రేమకు దారి తీసింది. వీరిద్దరు ఈనెల 11న వివాహం చేసుకున్నారు.ఇరు కుటుంబాలు ఒప్పుకోవడంతో ఎలాంటి చిక్కులురాలేదు.   వాస్తవానికి మౌనిక తండ్రి, మాలిక్‌ తండ్రి ఇద్దరు స్నేహితులు. అందుకే వీరి వివాహానికి గ్రీన్‌సిగ్నల్‌ పడిరదని కోలీవుడ్‌ మీడియా కథనం.
అయితే మౌనిక అసలు పేరు రేఖ మారుతిరాజ్‌.రేఖ పేరు గల ప్రముఖ నటి ఉండటంతో ఆమె పేరును మౌనికగా మార్చారు. మలయాళ సినిమాల్లో ఆమె పేరు పర్వాన. ఇక ఆమె ఇస్లాం స్వీకరించిన తర్వాత రహిమా పేరుతోనే కొనసాగుతానని చెప్పింది. ఇక పెళ్లి తర్వాత భర్త అనుమతితో సినిమాల్లో నటిస్తానని చెప్పింది.