భారత్‌ను హిందూదేశంగా ప్రకటించాలి

Posted On:19-01-2015
No.Of Views:339

రాజ్యాంగ పరంగా భారత్‌ను హిందూ దేశంగా ప్రకటించాలని, అప్పుడే హిందువులు సుఖసంతోషాలతో జీవిస్తారని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యధ్యక్షుడు డా.ప్రవీణ్‌భాయ్ తొగాడియా డిమాండ్ చేశారు. స్వర్ణ జయంతి ఉత్సవాల్లో భాగంగా మెదక్ జిల్లా సిద్దిపేటలో వీహెచ్‌పీ ఆధ్వర్యంలో సోమవారం విరాట్ హిందూ సమ్మేళనం నిర్వహించారు. విశిష్ట అతిథిగా హాజరైన తొగాడియా మాట్లాడుతూ దేశంలో హిందువులకు రక్షణ, సంపద, గౌరవం కావాలని, వీటిని సాధించేందుకు కోట్లమంది కార్యదీక్ష తీసుకోవాలని చెప్పారు. ఉమ్మడి పౌరస్మృతి అమలు చేయాలని కోరారు. రెండువేల ఏళ్ల కిందట ప్రపంచంలో 700 కోట్ల మంది హిందువులుండగా, నేడు 100 కోట్లకు పడిపోయారని, ఈ సంఖ్య మరింత దిగజారితే వారు స్వేచ్ఛగా జీవించలేరని తొగాడియా పేర్కొన్నారు. పాకిస్థాన్‌లో ఎవరు అధికారంలో ఉన్నా ముస్లింలకు అనుకూలంగానే పాలించారని, హిందూ దేశమైన ఇక్కడ అలా ఎందుకు లేదని ఆయన ప్రశ్నించారు. దేశంలో పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని తొగాడియా ధ్వజమెత్తారు.