గాలి జనార్దన్‌రెడ్డికి బెయిల్ మంజూరు..

Posted On:20-01-2015
No.Of Views:312

గాలి జనార్దన్‌రెడ్డికి బెయిల్ మంజూరు
 ఓఎంసీ కేసులో గాలి జనార్దన్‌రెడ్డికి సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ మంజూరు చేస్తే అభ్యంతరం లేదని సీబీఐ పేర్కొనడంతో సుప్రీంకోర్టు గాలి జనార్దన్‌రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది.
సూర్యాపేట చెరువులో వ్యాపారి మృతదేహాం లభ్యం
 నల్గొండ జిల్లా సూర్యాపేటలో నిన్న అపహరణకు గురైన వ్యాపారి శ్రీనివాస్ మృతదేహాన్ని సూర్యాపేట చౌదరి చెరువులో గుర్తించారు. హత్యకు భూ వివాదాలే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.
కిరణ్‌బేదీకి సవాలు విసిరిన కేజ్రీవాల్
 ఆప్ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ భాజపా దిల్లీ సీఎం అభ్యర్థి కిరణ్‌బేదీకి సవాలు విసిరారు. తనతోపాటు బహిరంగ చర్చలో పాల్గొనాలంటూ ట్విట్టర్‌లో సవాలు చేశారు. కేజ్రీవాల్ సవాల్‌ను స్వీకరించిన కిరణ్‌బేదీ చర్చకు సిద్దమేనని ప్రకటించారు. కేజ్రీవాల్‌కు చర్చ మీద నమ్మకం ఉంటే, తనకు మాట్లాడే ధోరణిపై నమ్మకం ఉందనికిరణ్‌బేదీ పేర్కొన్నారు.
వరంగల్ ఎస్పీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు దంపతులు
సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన బైరబోయిన భిక్షపతి, ఆయన సతీమణి రుక్మిణి మంగళవారం వరంగల్ ఎస్పీ అంబర్ కిశోర్ ఝా ఎదుట లొంగిపోయారు. ఆత్మకూరు మండలం మహ్మద్‌గౌస్ పల్లికి చెందిన భిక్షపతి 16 ఏళ్ల వయసులో మావోయిస్టుల పాటలకు ఆకర్షితుడై పార్టీలో చేరారు. వీరిపై ప్రభుత్వం రూ.ఆరు లక్షలు రివార్డు కూడా ప్రకటించింది.