153 పరుగులకే టీమిండియా ఆలౌట్

Posted On:20-01-2015
No.Of Views:342

బ్రిస్బేన్:ముక్కోణపు సిరీస్ లో భాగంగా ఇక్కడ ఇంగ్లండ్ తో  జరుగుతున్న డే అండ్ నైట్ వన్డేలో టీమిండియా 153 పరుగులకే ఆలౌటయ్యింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నటీమిండియా 39.3 ఓవర్లకే చాపచుట్టేసింది.  ఆదిలో శిఖర్ ధావన్(1) వికెట్ కోల్పోయిన టీమిండియా ఏ దశలోనూ ఆకట్టుకోలేదు. ఈ మ్యాచ్ లో కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ(34), స్టువర్ట్ బిన్నీ (44),అజ్యింకా రహానే(33), అంబటి రాయుడు(23)  పరుగులు మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. దీంతో ఇంగ్లండ్ కు 154 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే నిర్దేశించింది.  ఇంగ్లండ్ బౌలర్లలో ఫిన్ ఐదు వికెట్లు లభించగా,  అండర్ సన్ కు నాలుగు వికెట్లు దక్కాయి.