రైలు ఢీకొని బాడీబిల్డర్ మృతి

Posted On:20-01-2015
No.Of Views:349

 ప్రముఖ నటుడు, బాడీబిల్డింగ్ మోడల్ జార్జ్ పిట్ (37) ఓ రైలు ప్రమాదంలో మృతిచెందారు. ఇతడు ప్రముఖ బాడీ బిల్డర్. కండలు తిరిగిన వీరుడు. రైల్వే పట్టాలపై షూటింగ్ తీస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. కాలిఫోర్నియాలోని బర్బాంక్ రైల్వేస్టేషన్లో  పిట్, మరో జూనియర్ ఆర్టిస్టుతో కలిపి సినిమా తీస్తున్నారు. ఆ సమయంలో అటుగా వచ్చిన రైలును పిట్ పసిగట్టలేకపోయాడు. దాంతో ఆ రైలు ఢీకొని మరణించాడు.ఆ రైలు పక్క ట్రాక్ మీదనుంచి వెళ్తుందేమోనని భావించి పిట్ అక్కడే ఉన్నాడని, అందుకే అతడిది ఆత్మహత్య అని భావించలేమని ప్రత్యక్ష సాక్షి ఒకరు పోలీసులకు తెలిపారు. అయితే.. ఎవరైనా ప్రమాదం అని తెలిసి కూడా రైలు పట్టాలపై సినిమా షాట్లు తీస్తారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పిట్ బాల్టిమోర్లో జన్మించారు. ఐదేళ్లు ఆర్మీలో పనిచేశారు. తరువాత వెస్ట్ పాయింట్ నుంచి గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశారు. పిట్ మంచి పర్సనాలిటీ మోడల్. ఇప్పటివరకు 200 పత్రికల ముఖచిత్రాలపై కనిపించారు.