ముంబైలో దావూద్ సన్నిహితుడు తారీఖ్ పర్వీన్ అరెస్ట్

Posted On:20-01-2015
No.Of Views:302

 అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు అత్యంత సన్నిహితుడు తారీఖ్ పర్వీన్‌ను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్ తీవ్రవాద నిరోధక బృందం, లక్నో పోలీసులు సంయుక్తంగా ముంబైలో తారీఖ్‌ను అరెస్ట్ చేసినట్లు లక్నో ఎస్ఎస్‌పి యశస్వి యాదవ్ వెల్లడించారు.దావూద్ ముఠా కార్యకలాపాల్లో తారీఖ్ మొదటి వ్యక్తని తెలిపారు. దావూద్ సోదరి సారాకు ముంబైలోగల భవంతిలో తారీఖ్ నివసిస్తున్నాడని చెప్పారు. దుబాయ్ నుంచి ముంబైకి వచ్చిన తర్వాత తారీఖ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి 2004 నుంచి 2008 వరకు జైల్లో ఉన్నాడని తెలిపారు.బెయిల్‌పై బయటికి వచ్చాక గుర్తింపు మార్చుకుని తిరిగి మాఫియా కార్యకలాపాలు సాగిస్తున్నాడని చెప్పారు. 1990లో బాంబే మేయర్‌ను చంపేందుకు వెళ్లిన తారీఖ్ ముఠా ఏకె 47 ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో పట్టుబడిందని, ఆ కేసులోనే తారీఖ్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.