రామ్ చరణ్ హీరోయిన్ గురించి సన్నీ లియోన్

Posted On:20-01-2015
No.Of Views:303

మాజీ బూతు సినిమాల తార, ప్రస్తుత బాలీవుడ్ శృంగార తార సన్నీ లియోన్ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదనుకుంటా. ఇటీవల ఓ మేగజైన్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సన్నీ లియోన్ మీడియా వారు అడిగిన ప్రశ్నలకు ఆసక్తికరంగా సమాధానాలు ఇచ్చింది. ముఖ్యంగా ప్రియాంక చోప్రా (రామ్ చరణ్ తో జంజీర్ చిత్రంలో నటించింది) గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హిందీ చిత్రసీమలో మీరు ఇష్ట పడే ఇతర హీరోయిన్లు ఎవరు? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ....విద్యా బాలన్ అంటే ఇష్టం. అదే విధంగా కంగనా రనౌత్ కూడా చాలా బాగా యాక్ట్ చేస్తుంది. అయితే ప్రియాంక చోప్రా మాత్రం బాలీవుడ్లో అందరికీ స్పూర్తిదాయకమైన మహిళ. ఆమె గురించిన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటాను' అని చెప్పుకొచ్చింది. సన్నీ లియోన్ గురించి... ఒకప్పుడు సన్నీ లియోన్ పేరు వింటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది శృంగారమే. ఎందుకంటే ఆమె కెనయడిన్ పోర్న్ స్టార్ కాబట్టి. పెద్దలుక మాత్రమే పరిమితమైన లెక్కకు మిక్కిలి శృంగార చిత్రాల్లో నటించింది. ఆమె ఇండియాలో అడుగు పెట్టిన కొత్తలో విమర్శలే విమర్శలు. ఇలాంటి వారిని ఇండియన్ సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టడం ఏమిటంటూ ఆందోళనలు కూడా జరిగాయి. అయితే అన్నిటినీ భరించి....తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే రేంజికి ఎదిగింది. త్వరలో ఆమె ఇండియన్ సాంప్రదాయ నృత్యాలను కూడా వెండితెరపై ప్రదర్శించబోతోంది. సన్నీ లియోన్ త్రిపాత్రాభినయంలో నటిస్తున్న చిత్రం ‘లీలా'లో ఆమె క్లాసికల్ డాన్స్ చేయబోతోంది. ఇటీవలే ఓ క్లాసికల్ డ్యాన్స్ నంబర్ కూడా చిత్రీకరించారు. బాబీ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకురానుంది. భూషణ్ కుమార్, అహ్మద్, షైరా ఖాన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ కూడా విడుదైలంది. ప్రిన్సెస్ లుక్‌లో సన్నీ లియోన్ అభిమానులను ఆకట్టుకుంటోంది.