ప్రణీతతో మంచు మనోజ్ వివాహం!

Posted On:20-01-2015
No.Of Views:362

 టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ త్వరలో ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అతను ప్రణీత రెడ్డి అనే అమ్మాయిని పెళ్లాడబోతున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య మంచి పరిచయం ఉందని, ఇద్దరూ ఒకరంటే ఒకరు ఇష్ట పడుతున్నారని, ప్రేమించుకున్నట్లు సమాచారం. మంచు మనోజ్ కుటుంబ సభ్యులు కూడా వీరి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలోనే వీరి వివాహ శుభవార్త వినబోతున్నామని ఫిల్మ్ నగర్ జనాలు అంటున్నారు. మంచు విష్ణు భార్య వెరోనికాకు ప్రణీత క్లోజ్ ఫ్రెండ్ అని తెలుస్తోంది. ఈ విధంగానే ఆమె మంచు మనోజ్ కు కొన్నాళ్ల క్రితం పరిచయం అయిందట. త్వరలోనే ఎంగేజ్మెంట్ డేట్ ప్రకటించి అనంతరం వివాహ విషయాలు అధికారికంగా వెల్లడిస్తారని టాక్.