సూర్యాపేటలో అపహరణకు గురైన వ్యాపారి శ్రీనివాసరావు హత్య

Posted On:20-01-2015
No.Of Views:295

 నల్గొండ జిల్లా సూర్యాపేటలో రెండు రోజుల క్రితం అపహరణకు గురైన సంకోజు శ్రీనివాస్(35)ఇవాళ ఉదయం స్థానిక చౌదరి చెరువులో శవమై తేలాడు. పోలీసుల కథనం ప్రకారం... ఆస్తి తగాదాల నేపథ్యంలో శ్రీనివాస్, అతని కుటుంబ సభ్యులకు మధ్య గత కొంతలంగా వివాదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో నివాసముంటున్న శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతికి సూర్యాపేట వచ్చాడు. ఆదివారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లిన శ్రీనివాస్ తిరిగిరాలేదు. ఆందోళనకు గురైన ఆయన భార్య సోమవారం సూర్యాపేట పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈరోజు ఉదయం శ్రీనివాస్ మృతదేహం సూర్యాపేట చౌదరి చెరువులో లభ్యమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి దర్యాప్తు చేపట్టారు. ఈకేసుకు సంబంధించి ఐదుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.