కిరణ్ బేడీని ప్రశంసించిన దలైలామా

Posted On:20-01-2015
No.Of Views:286

 భాజపా దిల్లీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీని టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా ప్రశంసించారు. తీహార్ జైలుకు ఆమె డైరెక్టర్ జనరల్‌గా ఉన్నప్పుడు ఖైదీలతో ధ్యానం చేయించే సంప్రదాయానికి ఆమె శ్రీకారం చుట్టారన్నారు. ఈ విషయంలో ఆమెను తప్పక అభినందించాలని పేర్కొన్నారు. ధ్యానంతో ఏదైనా సాధ్యమని పేర్కొన్నారు