నాగార్జున మరదలిగా అనసూయ!

Posted On:21-01-2015
No.Of Views:319

బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయకు అగ్రహీరో సినిమాలో నటించే అవకాశం దక్కింది. అక్కినేని నాగార్జున కొత్త సినిమా 'సొగ్గాడే చిన్ని నాయన' సినిమాలో నటించేందుకు ఆమె అంగీకరించినట్టు టాలీవుడ్ సమాచారం. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాగార్జున డుయల్ రోల్ చేస్తున్నారు. లావణ్య త్రిపాఠి, రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు.ఇందులో నాగార్జున మరదలి పాత్రలో అనసూయ నటించనున్నారని తెలుస్తోంది. కొన్ని పాటల్లో నాగార్జునతో ఆమె డాన్స్ చేయనున్నారని కూడా అంటున్నారు. దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తన పాత్ర గురించి చెప్పిన వెంటనే చేయడానికి అంగీకరించారని సినీ జనాలు చెప్పుకుంటున్నారు. త్వరలోనే అనసూయ షూటింగ్ లో పాల్గొంటారు.గతంలో పవన్ కళ్యాణ్ 'అత్తారింటికి దారేది' సినిమాలో ప్రత్యేక గీతంలో నటించేందుకు అనసూయ విముఖత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కాగా, సొగ్గాడే చిన్ని నాయన' అనసూయకు రెండో సినిమా. అడవి శేష్‌ హీరోగా రవికాంత్‌ దర్శకత్వంలో రానున్న 'క్షణం' సినిమాలో ప్రస్తుతం ఆమె నటిస్తోంది.