రెండో స్థానంలో... షారుక్

Posted On:21-01-2015
No.Of Views:318

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య 11 మిలియన్లకు చేరింది. 12.8 మిలియన్ ఫాలోవర్స్‌తో బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్ ప్రథమ స్థానంలో నిలవగా, రెండో స్థానంలో షారుక్ నిలిచారు. షారుక్ ఖాన్ 2010లో ట్విట్టర్ ఖాతా తెరిచారు. వీరి తర్వాత ఆమీర్ఖాన్ను 10.8 మిలియన్లు, సల్మాన్‌ఖాన్‌ను 10.2, దీపికా పదుకొణేను 9.13, ప్రియాంకా చోప్రాను 8 మిలియన్ల మంది ట్విట్టర్లో ఫాలో అవుతున్నారు. బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ భార్య గౌరి ఫ్యాషన్ డిజైనర్‌గా మారారు. ఇప్పటి వరకు ఇంటీరియర్ డిజైనింగ్ రంగంలో ఉన్న గౌరీఖాన్ ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలోకి అడుగుపెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన సత్యపాల్ డిజైనర్ బ్రాండ్ 30వ వార్షికోత్సవం సందర్భంగా ్ణొరీఖాన్ ప్రత్యేకంగా కొన్ని దుస్తులను డిజైన్ చేశారు. వాటిని ప్రదర్శిస్తూ ఆమె ట్విట్టర్లో ఫొటోలు పోస్ట్ చేశారు.