నీతి ఆయోగ్ పూర్తికాల సభ్యునిగా దేవ్రాయ్

Posted On:21-01-2015
No.Of Views:317

‘భారత పరివర్తనకు జాతీయ సంస్థ’ (నీతి ఆయోగ్) పూర్తికాల సభ్యునిగా ప్రముఖ ఆర్థికవేత్త వివేక్ దేవ్రాయ్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఆయనతో పాటు భారత రక్షణ`పరిశోధన సంస్థ (డీఆర్డీవో) అధిపతి వి.కె.సారస్వత్ను పూర్తికాల సభ్యులుగా నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ‘విధానాల పరిశోధన కేంద్రం’ (సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్)లో ఆచార్యునిగా ఉన్న దేవ్రాయ్` రైల్వేబోర్డు పునర్వ్యవస్థీకరణపై ఏర్పాటైన సంఘానికి నేతృత్వం వహిస్తున్నారు. కోల్కత, దిల్లీ, కేంబ్రిడ్జిలలో చదువుకున్న ఆయన అనేక ఏళ్లుగా బోధన రంగంలో ఉన్నారు. అనేక పుస్తకాలు, వ్యాసాలు రచించారు.