ట్విట్టర్ వేదికగా కేజ్రీవాల్, బేడీల మాటల యుద్ధం

Posted On:21-01-2015
No.Of Views:282

ఫిబ్రవరి 7న జరగనున్న దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారం జోరందుకుంది. ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్, భాజపా సీఎం అభ్యర్థి కిరణ్‌బేడీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. గతంలో ఇద్దరూ అన్నాహజరే నేతృత్వంలో జన్‌లోక్‌పాల్ కోసం ఆందోళన నిర్వహించిన వారే కావడం గమనార్హం. అవినీతి వ్యతిరేక యుద్ధంలో కలిసి ఆందోళనలు నిర్వహించిన వీరు తాజా దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పరస్పరం తలపడుతున్నారు. అక్షరాస్యులు ఎక్కువగా వున్న దిల్లీలో ఇద్దరూ సోషల్‌మీడియా ట్విట్టర్‌ను వేదికగా చేసుకొని మాటల తూటాలను పేల్చడం విశేషం.
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల బరిలో 916 మంది అభ్యర్థులు:: దిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. బుధవారం నాటికి మొత్తం 916 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్టు ఈసీ వర్గాలు పేర్కొన్నాయి. గురువారం నామినేషన్ల పరిశీలన కార్యక్రమం నిర్వహించనున్నారు. బుధవారం రోజునే 532 నామినేషన్లు వచ్చాయి.