కూచిపూడిని దత్తత తీసుకున్న సిలికానాంధ్ర సంస్థ

Posted On:21-01-2015
No.Of Views:276

ప్రపంచంలోని వివిధ దేశాల్లో కూచిపూడి నాట్యాన్ని విశ్వవ్యాపితం చేసిన అమెరికాకు చెందిన సిలికానాంధ్ర సంస్థ.. ప్రధాని నరేంద్రమోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపునకు స్పందించింది. కూచిపూడి నాట్యకళకు పుట్టినిల్లు అయిన కృష్ణా జిల్లా కూచిపూడి గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కూచిభొట్ల ఆనంద్ ప్రకటించారు. కూచిపూడి గ్రామాన్ని ఆకర్షణీయ గ్రామంగా రూపొందిస్తామని, ఆధునిక సాంకేతికతతో అంతర్జాతీయ స్థాయిలో ఆ గ్రామంలో సౌకర్యాలు మెరుగుపరుస్తామని తెలిపారు. సిలికానాంధ్ర బృందాలు తరచుగా ఆ గ్రామాన్ని సందర్శించి, గ్రామాభివృద్ధికి కృషి చేస్తాయని వెల్లడిరచారు.