గూగుల్‌కు పోటీ సెర్చింజన్‌

Posted On:28-01-2015
No.Of Views:292

 గూగుల్‌కు పోటీగా మరో కొత్త సెర్చ్‌ ఇంజన్‌ వచ్చేస్తోంది. దాని పేరు ‘సైనెట్‌’! హెల్సింకీ ఇనిస్టిట్యూట్‌ పరిశోధకులు దానిని అభివృద్ధి చేశారు. అంతేకాదు.. గూగుల్‌ను సైనెట్‌ దాటేస్తుందని రూపకర్తలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడున్న సెర్చ్‌ ఇంజన్లతో పోలిస్తే తాము తయారుచేసిన సైనెట్‌ చాలా వైవిధ్యమైనదని అంటున్నారు. వినియోగదారుడికి ఒకవేళ తనకు పక్కాగా తెలియని విషయాన్నైనా ఎంతో కచ్చితంగా.. వేగంగా తెలుసుకోవచ్చని చెబుతున్నారు. ఇంటర్నెట్‌ సెర్చ్‌లను అది కీవర్డ్స్‌ సాయంతో రికగ్నిషన్‌ టాస్క్‌లా మారుస్తుందని వివరిస్తున్నారు. మనం తెలుసుకోవాలనుకున్న టాపిక్‌కు సంబంధించి అనేక కీవర్డ్స్‌ను రాడార్‌ పాయింట్లో చూపిస్తుందని, అవన్నీ ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయని టాపిక్‌ రాడార్‌లో ఆ పదాలను అటు ఇటు కదపడం ద్వారా తమకు కావలసిన సమాచారాన్ని పక్కాగా తెలుసుకోవచ్చని చెబుతున్నారు.