తెలంగాణ మంత్రుల కట్టడి

Posted On:29-01-2015
No.Of Views:264

 తెలంగాణ మంత్రులను కట్టడి చేయడంలో సీఎం కేసీఆర్ తన పట్టును విడవడం లేదు. టీఆర్‌ఎస్ పార్టీలోని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కేబినెట్‌లోని ఒకే సామాజిక వర్గానికి చెందిన ముగ్గురు మంత్రులను సీఎం ఒకింత తీవ్రంగానే మందలించినట్లు తెలుస్తోంది.ఆ మంత్రుల శాఖల్లో చోటు చేసుకుంటున్న వ్యవహారాలు... ప్రధానంగా బదిలీలు, కాంట్రాక్టులకు సంబంధించి  ఆరోపణలు రావడంతో ఆయన వీరిని మందలించినట్లు చెబుతున్నారు. ప్రభుత్వం అమలు చేసే ఏ పథకమైనా పార్టీ విధానంలో భాగమని,  వాటిని తమ పథకాలుగా మంత్రులెవరూ ఆపాదించుకోవద్దని కూడా సీఎం సున్నితంగానే సూచించినట్లు తె లి సింది. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన కడియం శ్రీహరి ‘ కేజీ టు పీజీ’ ఆలోచన తనదేనని పేర్కొనడం సీఎం దృష్టికి వెళ్లిందని, ఈ నేపథ్యంలో పై విధంగా స్పందించారని సమాచారం.