త్రిష పెళ్లిలో చార్మీ ఆటా పాట

Posted On:29-01-2015
No.Of Views:295

 స్నేహితురాలి పెళ్లిలో తన సూపర్ స్టెప్స్‌తో ఆహూతుల్ని అలరించడానికి నటి ఛార్మి సిద్ధం అవుతున్నట్టు సమాచారం. ఇంతకీ ఈ బ్యూటీకి అత్యంత క్లోజ్ ఫ్రెండ్ ఎవరనేది కదా మీ ఉత్సుకత. ఆ ఫ్రెండ్ ఎవరో కాదు. సంచలన నటి, చెన్నై చిన్నది త్రిష. ఈమెకు సన్నిహితులు అంటూ సినిమా వర్గాల్లో ఎవరూ లేరు. అంతా చదువుకున్న పట్టభద్రులే. అయితే, సినిమా వరకు తాప్సీ అత్యంత సన్నిహితురాలు. వీరిద్దరూ కలసి షాపింగ్‌లు, నైట్ పార్టీలు అంటూ, తెగ ఎంజాయ్ చేసే వాళ్లు. త్రిషకు పెళ్లి నిశ్చయం వార్త తెలియగానే మొదట ఖుషీ అయిన వ్యక్తి చార్మి. త్రిష నిశ్చితార్థంలో ఈ భామ సందడి చేశారు.  చార్మీ తన ట్విటర్‌లో పేర్కొంటూ, ఇకపై తాను త్రిషను చాలా మిస్ కాబోతున్నాను. త్రిష కూడా బ్యాచిలర్ జీవితాన్ని కోల్పోనుంది. అందుకు సమయం దగ్గర పడుతోంది అని పోస్టు చేశారు. బాలీవుడ్ నటీ నటుల వివాహ సమయాల్లో సహ తారలు ఆడి పాడి, ఆనంద డోలికల్లో తేలుతుంటారు. ఆ తరహాలో త్రిష పెళ్లిలో చార్మీ ఆటా పాట అంటూ ఖుషీ చేసేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం.