బాహుబలి సన్నివేశాల లీకేజీ కేసులో వర్మ అరెస్ట్

Posted On:31-01-2015
No.Of Views:286

బాహుబలి సినిమా లీకేజీ కేసులో వర్మ అనే వ్యక్తిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.  మకుట విజువల్ ఎఫెక్ట్లో పని చేస్తున్న వర్మ ...పోస్ట్ ప్రొడక్షన్ సమయంలో వీడియో ఫుటేజీని కాపీ కొట్టినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆ దృశ్యాలను వర్మ యూట్యూబ్లో అప్లోడ్ చేశాడని పోలీసులు నిర్థారణకు వచ్చారు.బహుబలి చిత్రానికి సంబంధించి కొన్ని దృశ్యాలను సోషల్ మీడియాలో లీక్ చేశారంటూ చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ  సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.  సినిమా విరామానికి ముందు 12 నుంచి 15 నిమిషాల దృశ్యాలు వాట్సప్, ఫేస్బుక్, యూట్యూబ్లో బహిర్గతమయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.  కాగా  80 కోట్ల బడ్జెట్తో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాలోంచి 13 నిమిషాల నిడివిగల సన్నివేశాలు లీకవ్వడం పట్ల టాలీవుడ్ వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.