చెత్త ప్రదర్శ..

Posted On:31-01-2015
No.Of Views:291

ఆస్టేలియా పర్యటనలో ఉన్న టీమిండియా అత్యంత చెత్త ప్రదర్శనను కనబర్చింది. ముక్కోణపు వన్డే సిరిస్‌లో భాగంగా శుక్రవారం ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలై సిరిస్ నుంచి వైదొలగింది. 1967-68 నుంచి ఇలా ముక్కోణపు వన్డే సిరిస్‌లో ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయకుండా వైదొలగడం గమనార్హం. అప్పటి నుంచి ఇప్పటి వరకు టీమిండియా ఒక్క సింగిల్ (ప్రాక్టీసు, టెస్టు, వన్డే)మ్యాచ్‌లో గెలవకుండా వైదొలగడం ప్రస్తుత ఆస్టేలియా సిరిస్‌లోనే జరిగింది. వచ్చే నెలలో ఐసీసీ వరల్డ్ కప్ ఉన్న తరుణంలో టీమిండియా ప్రదర్శన 47 సంవత్సరాల్లో కనివినీ ఎరుగని రీతిలో అధఃపాతాళానికి చేరింది. 1967-68లో కూడా టీమిండియా సరిగ్గా ఇలానే టెస్టుల్లో ఆతిధ్య జట్టు చేతిలో వైట్‌వాష్ అయింది. నవంబర్ 2014లో టీమిండియా టెస్టు, వన్డే సిరిస్‌లో పాల్గొనేందుకు ఆస్టేలియాకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఆస్టేలియా టూర్‌లో టీమిండియాకు చాలా చేదు అనుభవాలు ఎదురయ్యాయి. టీమిండియా ప్రస్తుత వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భారత్ 0-2తో పరాజయం పాలైన విషయం తెలిసిందే. మెల్‌బోర్న్‌లో జరిగిన టెస్టు మ్యాచ్ ఓటమి తర్వాత ధోని రిటైరయ్యారు. టెస్టు మ్యాచ్ అనంతరం ఆస్టేలియా, ఇంగ్లాండ్, భారత్ ముక్కోణపు వన్డే సిరిస్ ప్రారంభమైంది. ఈ వన్డే సిరిస్‌లో టీమిండియా రెండు సార్లు ఇంగ్లాడ్ చేతిలో ఓడిపోగా, ఆస్టేలియాతో ఒక మ్యాచ్ ఓటమిని చవిచూసింది. ఈ టూర్‌లో ఎన్నో ఆశలతో బరిలోకి దిగినా టీమిండియా, అభిమానులను నిరాశ పర్చిందనే చెప్పాలి.